ఏలూరు జిల్లా : ముదినేపల్లి : ది డెస్క్ :

మండలంలోని విశ్వనాధునిపాలెం కు చెందిన గొల్లపల్లి సన్నీ(26) శుక్రవారం రాత్రి ప్రమాదవశాత్తు మరణించారు. విషయం తెలుసుకున్న అంబుల వైష్ణవి తండ్రి ద్వారా బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. మృతునికి ఇద్దరు చిన్న కుమారులు, భార్య ఉన్నారు. మట్టి ఖర్చులు భరించలేని స్థితిలో కుటుబం ఉండి ఆర్థిక సహాయన్ని కోరగా.. వెంటనే స్పందించిన అంబుల వైష్ణవి దహన సంస్కారాల నిమిత్తం రూ.5 వేలు తన తండ్రి డాక్టర్ మనోజ్ చేతులమీదుగా శనివారం మృతుని కుటుంబానికి అందించి ఆసరాగా నిలిచారు.