The Desk…RJY : పన్నుల వసూళ్ల లో రూ.20 కోట్ల మేర అదనపు ఆదాయం అభినందనీయం ➖కలెక్టర్ పి ప్రశాంతి

The Desk…RJY : పన్నుల వసూళ్ల లో రూ.20 కోట్ల మేర అదనపు ఆదాయం అభినందనీయం ➖కలెక్టర్ పి ప్రశాంతి

  • షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ పన్ను బకాయిలు పై జి ఎస్ టి అధికారుల ద్వారా తనిఖీలు నిర్వహించాలి
  • మునిసిపల్ కమిషనర్ కేతన గార్గ్ తో కలిసి ఇంజనీరింగ్, అకౌంటింగ్, టౌన్ ప్లానింగ్, శానిటేషన్, గార్డెనింగ్ పై కలెక్టర్ స

🔴 తూ.గో జిల్లా : రాజమహేంద్రవరం : ది డెస్క్ :

నగర పాలక సంస్థ పనులలో, వాటి చెల్లింపులు జాప్యాన్ని నివారించాలని , నాణ్యత ప్రమాణాలు పై ఆడిటింగ్ ఉండాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అధికారులను ఆదేశించారు.మంగళవారం సాయంత్రం కమీషనర్ కేతన్ గార్గ్ తో కలసి స్థానిక నగర పాలక సంస్థ కార్యాలయంలో కలెక్టర్ RMC పరిథిలో చేపట్టిన ఇంజనీరింగ్ పనులు, చెల్లింపులు, టౌన్ ప్లానింగ్ విభాగం పై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ… పనులు పూర్తయ్యే వ్యవధి, పనులు పూర్తయిన తర్వాత చెల్లింపుల వ్యవధిని హేతుబద్ధీక రించాలన్నారు. చేపట్టిన పనులు, వాటి వివరాలు నిర్ధారణ ఇంజనీరింగ్ అధికారులు బాధ్యత వహిస్తారని, చెల్లింపులు విషయంలో ఎటువంటి జాప్యం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. సాంకేతిక అనుమతుల కోసం నాలుగు నెలల సమయం తీసుకోవడం సరికాదని, కౌన్సిల్ తీర్మానాన్ని (సి ఆర్ ) బూచిగా చూపించి పనులు ఆలస్యం చెయ్యవద్దని సూచించారు.

ప్రజారోగ్యానికి సంబంధించిన పనులను వెంటనే చేపట్టాలని, ఒక వారం లో వర్క్ ఆర్డర్ ఇవ్వాలని చెప్పారు. అయితే సి ఆర్ లేకుంటే వర్క్ ఆర్డర్ ఇవ్వకుండా ఆపవచ్చని చెప్పారు. పనుల ఆలస్యానికి కారణమయిన గుత్తెదారుపై జరిమానా విధించాలని చెప్పారు. చేపట్టిన, అపరిష్కృత (పెండింగ్) ఉన్న, పూర్తయిన పనుల వివరాలు నెలల వారీగా నమోదు చేయాలన్నారు.

సగటున ఎంత చెల్లించారు, ఎంత సమయం లో చెల్లించారో తెలపాలన్నారు. పనులు పూర్తి అయిన తరువాత బిల్ రికార్డు చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నారని, ఈ ప్రక్రియను వేగవంతం గా పూర్తి చేయాలన్నారు.టౌన్ ప్లానింగ్ విభాగం లో భవన అనుమతులు, వాటిలో ఆక్యుపెన్సీ ధృవీకరణ పొందిన వాటి వివరాలు బేరీజు వేసుకోవాలన్నారు. నిబంధనలు పాటించకుండా నిర్మాణాలు చేపట్టి ఉన్న వారు ఆక్యుపెన్సీ ధృవీకరణ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం లేదన్నారు.

అటువంటి వాటి పై దృష్టి సారించడం ముఖ్యం అన్నారు.  అదే సమయంలో గత ఆర్థిక సంవత్సరంలో పన్నుల వసూళ్ల లో, ఈ ఏడాది ముందస్తు పన్ను చెల్లింపు కోసం 5 శాతం రిబేట్ వసూళ్ల లో రూ.33  కోట్ల మేర చెయ్యడం జరిగిందని, ఇందు కోసం పనిచేసిన వారిని ప్రత్యేకంగా కలెక్టర్ పి. ప్రశాంతి అభినందించారు.

1-4-2024 నుండి 31-3-2025 వరకూ ఇంటి పన్నులు రూ.62.61 కోట్లు, ఖాళీ స్థలం పన్నులు రూ.11.43 కోట్లు, నీటి చార్జీల రూ.9.19 కోట్లు వెరసి రూ.83.23 కోట్లు వసూలు చేశారనీ మునిసిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ తెలియ చేశారు.

గత ఏడాది కంటే రూ.20 కోట్ల మేర అధిక మొత్తంలో వసూళ్లు సాధించడం అధికారులు, సిబ్బంది సమన్వయం తో సాధ్యం అయిందన్న విషయాన్ని తెలిపారు. పార్కుల నిర్వహణ, శానిటేషన్ ప్రక్రియ, వాహనాలు వినియోగం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో అదనపు కమిషనర్ – పివి రామలుంగేశ్వర్ డిప్యూటీ .కమీషనర్- ఎస్.వెంకట రమణ, సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎం.కోటేశ్వరరావు , సిటీ ప్లానర్ జి.కోటయ్య మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డా.ఎ.వినుత్న కార్యదర్శి జి.శైలజావల్లి, మేనేజర్ మాలిక్, తదితరులు పాల్గొన్నారు.