The Desk…Eluru : ప్రశాంతంగా ముగిసిన నీట్‌ – 2025 పరీక్షలు

The Desk…Eluru : ప్రశాంతంగా ముగిసిన నీట్‌ – 2025 పరీక్షలు

ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

ఏలూరు జిల్లాలో 5 పరీక్ష కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగిందనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. ఈమేరకు పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.00 గంటలవరకు కొనసాగింది. అయితే విద్యార్థులను 11 గంటల నుంచే కేంద్రంలోకి అనుమతించారు. లోపలికి అనుమతించే క్రమంలో విద్యార్థినులను క్షుణ్ణంగా పరిశీలించారు. జిల్లాలో మొత్తం 5 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.

అన్ని పరీక్ష కేంద్రాల్లో 1,200 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా ఇందులో 1,162 మంది హాజరవగా,మరో 38 మంది పరీక్షకు హాజరుకాలేదు. ప్రభుత్వం జూనియర్ కళాశాల, కోటదిబ్బ పరీక్ష కేంద్రంలో 240 మందికి గాను 232 మంది, కస్తూరిభా మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల, కోటదిబ్బ పరీక్ష కేంద్రంలో 360 మందికి గాను 347 మంది, సుబ్బమ్మదేవి మున్సిపల్ హైస్కూల్, ఆర్.ఆర్.పేట, పరీక్షా కేంద్రంలో 240 మందికి గాను 234 మంది,కేంద్రీయ విద్యాలయ, గోపన్నపాలెం పరీక్ష కేంద్రంలో 240 మందికి గాను 235 మంది,ప్రభుత్వం ఉన్నత పాఠశాల, గోపన్న పాలెం, పరీక్షా కేంద్రంలో 120 మందికి గాను 114 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు.