గుంటూరు జిల్లా : తెనాలి : ది డెస్క్ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మానవీయతకు చిరునామాగా నిలిచారు. తెనాలి క్యాంపు కార్యాలయంలో వచ్చిన ఓ దివ్యాంగుడు తన సమస్యలను ఆర్జీ రూపంలో అందించేందుకు వచ్చాడు.
దీంతో, మంత్రి స్వయంగా నేలపై కూర్చుని ఆ దివ్యాంగుడిని సమస్యను ఆలకించారు. ఆర్జీని స్వీకరించిన అనంతరం సంబంధిత అధికారులకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.