The Desk…Mudinepalli : అమరావతి రాజధాని నిర్మాణం, అభివృద్ధి కొరకు – లక్ష్మీ గణపతి మహా యజ్ఞం

The Desk…Mudinepalli : అమరావతి రాజధాని నిర్మాణం, అభివృద్ధి కొరకు – లక్ష్మీ గణపతి మహా యజ్ఞం

🔴 ఏలూరు జిల్లా : ముదినేపల్లి : ది డెస్క్ :

స్థానిక ముదినేపల్లికి చెందిన డాక్టర్ మనోజ్ హాస్పిటల్ ఆవరణలో…అమరావతి నిర్మాణం అభివృద్ధి త్వరితగతిన పూర్తవ్వాలని.. లక్ష్మీ గణపతి మహాయజ్ఞం చేసిన అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి.

ఈ సందర్భంగా అంబుల వైష్ణవి మాట్లాడుతూ..

అమరావతి నిర్మాణం, అభివృద్ధి అందరి సహాయ – సహకారాలతో మరింత వేగంగా అవ్వాలని ఈ యజ్ఞం చేయడం జరిగిందని వైష్ణవి తెలిపారు.

ఈ సందర్భంగా అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి తండ్రి డాక్టర్ మనోజ్ మాట్లాడుతూ….

దేశ ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెలలో లక్ష కోట్ల అమరావతి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసే క్రమంలో భాగంగా.. లక్ష్మీ గణపతి మహా యజ్ఞం చేశామని..

అదేవిధంగా మన విజన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలల రాజధాని ఈ ఐదేళ్లలో కంప్లీట్ చేయాలని, రాష్ట్రం బాగుండాలని, పరిశ్రమలు రావాలని, ప్రజలు సంతోషంగా ఉండాలని అమరావతి మనకు ప్రత్యేకమైన రాష్ట్రంగా ఉండాలని ..

ఉగాది తరువాత వచ్చే నెలలో ప్రతి గృహాన్ని దర్శించి జోలి పట్టి అమరావతి నిర్మాణం కొరకు, ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండటం కొరకు , రాష్ట్ర అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరూ సహాయపడాలని… కలల రాజధాని నిర్మాణం కొరకు కృషి చేద్దామని డాక్టర్ మనోజ్ తెలిపారు.

www.thedesknews.net