The Desk…Kadiyam : వేమగిరిలో తడిచెత్త – పొడిచెత్త సేకరణపై అవగాహన

The Desk…Kadiyam : వేమగిరిలో తడిచెత్త – పొడిచెత్త సేకరణపై అవగాహన

🔴 తూ.గో జిల్లా : కడియం మండలం : ది డెస్క్ :

వేమగిరి గ్రామపంచాయతీ పరిధిలో గ్రామ కార్యదర్శి ఎం. రూప్ చంద్ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక పారిశుధ్య చర్యలు చేపట్టారు. తడిచెత్త – పొడిచెత్త సేకరణకు సంబంధించి అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమానికి మండల పంచాయతీ విస్తరణాధికారి ఎస్‌వి రాంప్రసాద్ విచ్చేసి పరివేక్షించారు. తడి ,పొడి చెత్త సేకరణకు సంబంధించి ఇంటింటికి విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. అందుకు అవసరమైతే ఫ్లెక్సీలు, మైకుల ద్వారా ప్రచారాలు చేపట్టాలని రాంప్రసాద్ సూచించారు.

తడి , పొడి చెత్త సేకరణకు సంబంధించి ఆ గ్రామ పారిశుధ్య కార్మికులకు పలు సూచనలను ఇచ్చారు.

చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం ద్వారా సేకరించిన చెత్తను ఏ విధంగా వినియోగిస్తున్నారనేదానిపై రాంప్రసాద్ పరిశీలించారు.