విద్యా ప్రమాణాలు మెరుగుపడాలి

విద్యా ప్రమాణాలు మెరుగుపడాలి

ద డెస్క్ న్యూస్: ఉపాధ్యాయులు పని తీరు మారాలి. ఎన్రోల్మెంట్ పెరగాలి కథలు చెప్పితే వినను పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు రూ.2.5 కోట్లు జిల్లా కలెక్టర్ ఎ. ఎస్. దినేష్ కుమార్

పాడేరు ఆగస్టు 8 విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి విద్యా ప్రమాణాలు మెరుగు పరచాలని జిల్లా కలెక్టర్ ఎ. ఎస్ .దినేష్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎం. ఇ. ఓలు, ఎటిడబ్ల్యూలతో గురువారం సమావేశం నిర్వహించారు. చింతూరు రంపచోడవరం అధికారులతో పర్చువల్ విధానంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధార్ ఎనోల్ చేసి విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించాలని ‘సూచించారు. ఆధార్ లేదని కథలు చెపితే ఉపేక్షించనని హెచ్చరించారు. ఎం. ఇ. ఓలు తప్పని సరిగా పాఠశాలలను తనిఖీ చేసి విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి చర్యలు చేపట్టాలన్నారు. ఉపాధ్యాయులు పాఠశాలలకు రాకుండా బినామీ ఉపాధ్యాయులతో నడిపిస్తే ఎం. ఇ. ఓలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెండు నెలలైనా ఎన్ రోల్మెంట్ పూర్తి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.

మండలాల వారీగా ఎంత మంది విద్యార్థులు ఉన్నారని ఎం ఇ ఓలను అడిగి తెలుసు కున్నారు. టీవర్లు పాఠశాలలకు వస్తున్నారా ? విద్యార్థుల కోసం ఉపాధ్యాయులా ? ఉపాధ్యాయుల కోసం విద్యార్థులా? అంటూ ఎం ఇ ఓలను ప్రశ్నించారు. దగ్గరలో ఎక్కడ నెట్ వర్కు అందుబాటులో ఉంటే అక్కడకు వెళ్లి ఫేషియల్ అటెండెన్సు వేసి పాఠశాలకు హాజరు కావాలన్నారు. ఈనెల 17 పాఠశాల విద్యా కమిటీలు ఎన్నికలు నిర్వహించి వెంటనే కమిటీలతో ప్రమాణ స్వీకారం చేయించాలని సూచించారు. 18 వతేదీ నుండి పాఠశాలలో తాగునీరు, విద్యుత్తు వంటి మౌకలి సదుపాయాల పనులు చేయాలన్నారు. మౌలిక సదుపాయాలు కల్పనకు రూ.2.5కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

ఉపాధ్యాయులు పాఠ్య ప్రణాళికలు తయారు చేసి అమలు చేయాలన్నారు. విద్యార్థులకు కనీసం చదవటం, రాయడం రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసారు. ఎం. ఓలు హెడ్ క్వార్టరులో కూర్చుంటే కుదరదని విద్యా ప్రమాణాలు పర్యవేక్షించాలని చెప్పారు. మధ్యాహ్నం భోజన పథకాన్ని పక్కా అమలు చేసి ప్రభుత్వం నిర్దేశించిన మెనూ విద్యార్థులకు అందించాలని అన్నారు. విద్యార్థులకు బైస్ లైన్ పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. విద్యాశాఖ పిల్లలకు విద్యను అందించడానికేనని, విద్యను అందించడంలో నిర్లక్ష్యంగా ఉంటే ఉపేక్షించనన్నారు. విద్యార్థులను

ఎబిసిడి గ్రేడుగా విభజించి, సిడి గ్రేడులో ఉన్న విద్యార్థులను బి గ్రేడుకు తీసుకుని రావాలన్నారు. అదే విధంగా ఉపాధ్యాయులకు సబ్జెక్టులు, మెథడాలజీలలో శిక్షణ అందిస్తామన్నారు. యూనియన్ లీడర్లతో సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పారు. స్టూడెంట్ల కిట్లు పంపిణీ, సికిల్సెల్ ఎనిమియా పరీక్షలు, విద్యార్థుల ఆరోగ్యం, ఆశ్రమ పాఠశాలలు, ఎం ఆర్ ఎస్ పాఠశాలల్లో పారిశుద్ధ్యంపై సమీక్షించారు. అన్ని పాఠశాలలో దోమల మందు పిచికారీ పనులు నిర్వహించాలని చెప్పారు.ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి పి. గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు మండలాల ఎం బ్రహ్మాజీరావు, కొండలరావు, 11 లు, ఎటిడబ్ల్యూ ఓలు పాల్గొన్నారు. రంప చోడపం, చింతూరు అధికారులు పాల్గొన్నారు. thedesknews.net