విజ‌య‌న‌గ‌రం ఆగష్టు 1 న జాబ్‌మేళా

విజ‌య‌న‌గ‌రం ఆగష్టు 1 న జాబ్‌మేళా

విజ‌య‌న‌గ‌రం, జూలై 29 ః (ద డెస్క్ న్యూస్)
వివిధ కంపెనీల్లో ఉద్యోగాల భ‌ర్తీ కోసం ఆగష్టు 1 న జాబ్‌మేళా నిర్వ‌హిస్తున్న‌ట్లు జిల్లా ఉపాధి క‌ల్ప‌నాధికారి డి.అరుణ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. అమర్ రాజా బ్యాటరీస్ లో మిషన్ ఆపరేటర్ (250), అప్రంటీస్ ట్రైనీ(250), ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకులో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జ్క్యూటివ్స్ (60) ఉద్యోగాల భ‌ర్తీ జ‌రుగుతుంద‌ని తెలిపారు. ఆయా పోస్టుల‌ను బ‌ట్టి ఐటిఐ, ఇంటర్, డిగ్రీ, ఉత్తీర్ణులైన‌వారు అర్హుల‌ని పేర్కొన్నారు. ఎంపికైన వారు చిత్తూరు, శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో ప‌నిచేయాల్సి ఉంటుంద‌ని తెలిపారు. ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్ధులు త‌మ పేర్ల‌ను ముందుగా ఎంప్లాయిమెంట్.ఎపి.జిఓవి.ఇన్ వెబ్‌సైట్‌లో న‌మోదు చేసుకొని, ఆగస్టు 1 ఉద‌యం 10 గంట‌ల‌కు విజ‌య‌న‌గ‌రం విటీ అగ్రహారం, బిసి కాలనీలోని ప్రభుత్వ ఐటిఐ లో జ‌రిగే ఇంట‌ర్వ్యూకి హాజ‌రు కావాల‌ని కోరారు. ఇత‌ర వివ‌రాల కోసం 8919179415 నంబ‌రుకు సంప్ర‌దించాల‌ని సూచించారు.