THE DESK NEWS: ఏలూరు జిల్లా: చింతలపూడి: 27-05-2025
ఏలూరు జిల్లాలోని చింతలపూడి, లింగపాలెం మండలాల్లో రోడ్లపైన పరిమితికి మించి అధిక లోడుతో తిరుగుతున్న లారీలు (ఫామ్ ఆయిల్ గెలలు రవాణా చేసేవి),టిప్పర్లకు మరియు రోడ్డు టాక్స్ , ఫిట్నెస్ లేని వాహనాలకు సుమారు ఒక లక్ష యాబై వేల రూపాయలు అపరాధ రుసుము విధించారూ రవాణా శాఖ అధికారులు. ఈ వాహన తనిఖీల్లో ఏలూరు జిల్లా నూజివీడుకి చెందిన అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇస్పెక్టర్స్ అన్నపూర్ణ మరియు కృష్ణ వేణి పాల్గొన్నారు.
రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, ప్రతీరోజు రోడ్డు నియమ నిబంధ నలు పాటిస్తూ సంవత్సరాంతం ఎలాంటి ప్రమా దాలు జరుగకుండా డ్రైవర్లు వాహనాలను జాగ్రత్తగా నడపాలన్నారు.
డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ఫోన్లను ఉప యోగించొద్దని, ఇతరులతో మాట్లాడకుండా డ్రైవింగ్ చేయాలని అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇస్పెక్టర్స్ వాహనదారులకు తెలియచేశారు