ది డెస్క్ న్యూస్ : ఏలూరు జిల్లా చింతలపూడి లో జాతీయ అగ్నిమాపక దినోత్సవం నేపథ్యంలో స్థానిక అగ్నిమాపక కేంద్రంలో సోమవారం వారోత్సవాలను ప్రారంభించినట్లు స్టేషన్ ఫైర్ అధికారి కె వెంకట రెడ్డి తెలిపారు.
1944 ఏప్రిల్ 14న ముంబాయిలోని జరిగిన అగ్నిప్రమాదంలో 66 మంది అగ్నిమాపక సిబ్బంది మరణించారని, వారిని స్మరించుకొంటూ ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో స్థానిక అగ్నిమాపక ఉద్యోగులు వారోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.
అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా 15.04.2025న చింతలపూడి లోని కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, శారద థియేటర్ మరియు షాపింగ్ మాల్స్ నందు కరపత్రాలను పంచుతూ ప్రజలకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించిన అగ్నిమాపక సిబ్బంది.
ఫైర్ అధికారి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ
అంతేకాకుండా జాతీయ మౌలిక సదుపాయాల అభివృద్ధికి అగ్ని బద్ధతపై పూర్తి దశలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. సాధారణ జాగ్రత్తలు లో భాగంగా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వస్తువులను చిందిరావందరంగా లేకుండా సక్రమంగా ఉంచుకోవాలని తెలిపారు. ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు అగ్గిపెట్లు, లైటర్లు, టపాకాయలు, ఎలక్ట్రికల్ సామాగ్రి, ఇతర మండే పదార్థములు ఏవి కూడా అందుబాటులో ఉంచరాదని తెలిపారు. అనుకోకుండా జరిగే అగ్ని ప్రమాదాలకు ముందుగానే కొంత నీటిని మీ ఇంటిలో నిల్వ చేసుకోవాలని తెలిపారు. ఇంట్లో వంటింటి క్రింద పై భాగాలలో గాలి, వెలుతురు ఉండేటట్లు చూసుకోవాలని, సిలిండర్ విషయంలో తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని తెలిపారు. గ్యాస్ లీక్ అవుతున్నట్లు మీకు తెలిసిన వెంటనే రెగ్యులేటర్లను తప్పక ఆపివేయాలని తెలిపారు. వంట చేసేటప్పుడు సరియైన నూలు బట్టలు ఏఫ్రాన్ దుస్తులు ధరించాలని తెలిపారు. ప్రమాదవశాత్తు మీ బట్టలకు నిప్పు అంటుకుంటే భయంతో పరిగెత్తవద్దని, నేలపై దొర్లి, దుప్పటి లేదా కోటు లేదా పెద్ద టవల్ను చుట్టుకోండి అని తెలిపారు. మీ చుట్టుపక్కల అగ్ని ప్రమాదం జరిగితే ప్రతి ఒక్కరూ ఆరు బయటకు వెంటనే సురక్షితంగా రావాలని తెలిపారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు విలువైన వస్తువులు గూర్చి సమయాన్ని వృధా చేసుకోకుండా వాటి కొరకై తిరిగి లోనికి ప్రవేశించరాదని తెలిపారు. విద్యుత్ పరికరాలకు నిప్పంటుకున్నప్పుడు నీళ్లతో ఆర్పవద్దని దీనివల్ల కరెంటు షాక్ కు తగిలి ప్రాణాపాయము కలగవచ్చునని తెలిపారు. అలా కాకుండా వెంటనే కరెంటును ఆఫ్ చేయాలని తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే పట్టణ అగ్నిమాపక కేంద్రానికి గాని 101 కు సమాచారాన్ని అందించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్టేషన్ ఫైర్ అధికారి
వెంకట రెడ్డి. ఎల్ ఎఫ్ రామకృష్ణ, సిబ్బంది బి రవి కుమార్, బి.అది శేషు, టి. కోటేశ్వరరావు తదితర అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.