THE DESK NEWS: 30-04-2025 ఏలూరు జిల్లా చింతలపూడి ఇన్స్పెక్టర్ సిహెచ్ రాజశేఖర్ ఎస్ఐ కుటుంబరావు లు బెట్టింగ్ ల వలన కలిగే అనర్ధాలను గురించి – చింతలపూడి లో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించినారు
ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, IPS గారి ఆదేశాల పై జంగారెడ్డిగూడెం డీఎస్పీ శ్రీ యు. రవిచంద్ర గారి పర్యవేక్షణలో చింతలపూడి పట్టణంలోని పలు ప్రాంతాల్లో “మిత్రమా – బెట్టింగ్ లు అంటే అప్పులు, అబద్ధాలు, అరెస్టులు” అనే శీర్షికతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన చింతలపూడి ఇన్స్పెక్టర్ గారు.
చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ సిహెచ్. రాజశేఖర్, చింతలపూడి ఎస్‌ఐ శ్రీ కుటుంబరావు గారు మరియు వారి పోలీస్ సిబ్బంది సంయుక్తంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో చింతలపూడి ఇన్స్పెక్టర్ గారు మాట్లాడుతూ బెట్టింగ్ వ్యసనం ఎలా వ్యక్తిగత, కుటుంబ, సమాజ జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతోందో అనే విషయాలపై వివరంగా ప్రజలకు అవగాహన కల్పించారు.
“బెట్టింగ్ చేస్తే ఓడేది మన జీవితమే” అనే సందేశంతో యువతలో చైతన్యం కల్పించే ప్రయత్నం చేశారు.
బెట్టింగ్ కు బానిసలవుతున్న వారిని గుర్తించి వారికి మానసిక మద్దతు, సలహాలు అందించేందుకు పోలీస్ శాఖ సన్నద్ధంగా ఉందని తెలియ చేసినారు.
ప్రజలు గోప్యంగా సమాచారం అందించాలంటే డయల్ 112 కు లేదా జిల్లా ఎస్పీ వాట్సాప్ నెంబర్ 9550351100 ను ఉపయోగించ వచ్చని సూచించారు.
చట్ట విరుద్ధంగా బెట్టింగ్, గ్యాంబ్లింగ్ లలో పాల్గొన వద్దని, ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొనడం పట్ల చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ గారు హెచ్చరించారు.
“బెట్టింగ్ అనేది ఒక వ్యసనమే కాదు – అది జీవితాల్ని నాశనం చేసే సామర్థ్యం కలిగిన శత్రువు. ఇది అప్పులకు, మోసాలకు, చివరికి అరెస్టులకు దారి తీస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ మానసిక వ్యాధిని సమాజం నుండి తరిమికొట్టేందుకు ముందడుగు వేయాలి అని,
పోలీసు శాఖ ప్రజల భద్రతకే కాదు – మార్గదర్శకత్వానికీ మరియు నిబంధనల ఆచరణ కు చింతలపూడి పోలీస్ అధికారులు ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటారని ఇన్స్పెక్టర్ గారు ప్రజలకు హామీ ఇచ్చినారు