గర్భిణీకి ప్రసవ నెప్పులు రావడంతో మంచానికి జట్టి కట్టుకొని రెండు కిలోమీటర్లు కుటుంబ సభ్యులు మోసుకువచ్చారు.

గర్భిణీకి ప్రసవ నెప్పులు రావడంతో మంచానికి జట్టి కట్టుకొని రెండు కిలోమీటర్లు కుటుంబ సభ్యులు మోసుకువచ్చారు.

ద డెస్క్ న్యూస్: తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల గర్భిణీకి ప్రసవ నెప్పులు రావడంతో మంచానికి జట్టి కట్టుకొని రెండు కిలోమీటర్లు కుటుంబ సభ్యులు మోసుకువచ్చారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని ఆర్ కొత్తగూడెం గ్రామం నుంచి లోపలికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో బూరుగుపాడు అనే ఆదివాసి గ్రామం ఉంది.

రవ్వ ఉంగి అనే గర్భిణీకి ప్రసవ నొప్పులు రావడంతో అత్యవసరంగా ఆసుపత్రికి తీసుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు మంచానికి జట్టి కట్టి జోరు వానలో బురద రోడ్డులో రెండు కిలోమీటర్లు మోసుకు రావాల్సి వచ్చింది.

తారు రోడ్డు వరకు తీసుకువచ్చిన కుటుంబ సభ్యులు అనంతరం 108 వాహనంలో సత్యనారాయణపురం పిహెచ్సికి తరలించారు.

ఆసుపత్రిలో రవ్వా వుంగి కవల పిల్లలకు జన్మనిచ్చింది. https://thedesknews.net/