ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో ఆటో యూనియన్ డ్రైవర్లు, యజమానులు, మాక్సీ క్యాబ్ డ్రైవర్లు, యజమానులు మరియు సహాయకులకు  రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు

ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో ఆటో యూనియన్ డ్రైవర్లు, యజమానులు, మాక్సీ క్యాబ్ డ్రైవర్లు, యజమానులు మరియు సహాయకులకు రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు

THE DESK NEWS: 14-02-2025: ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో ఆటో యూనియన్ డ్రైవర్లు, యజమానులు, మాక్సీ క్యాబ్ డ్రైవర్లు, యజమానులు మరియు సహాయకులకు రహదారి భద్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారి జి నాగ మురళి డ్రైవర్లకు రహదారి భద్రత నియమాల గురించి వివరించారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోకూడదని తెలిపారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి వేగ పరిమితులను పాటించాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ వంటి భద్రతా పరికరాలను ధరించాలని సూచించారు.ప్రమాద సంభవించకుంటే స్పందించే అవకాశం ఉండాలని తెలియజేశారు ర్యాష్ డ్రైవింగ్, రెడ్ లైట్లు దూకడం వంటి వాటికి దూరంగా ఉండాలని హెచ్చరించారు. రోడ్డు దాటేటప్పుడు కుడివైపు, ఎడమవైపు చూసి దాటాలని, ట్రాఫిక్‌ను ఎదుర్కోవడానికి భుజం వైపు నడవాలని సూచించారు.

కార్యక్రమం అనంతరం రవాణా శాఖ అధికారులు రహదారి భద్రత అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న వారికి భోజన ఏర్పాట్లు చేశారు

ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు కృష్ణ వేణి, అన్నపూర్ణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు ప్రమాణ సంస్థ నూజివీడు డిపో మేనేజర్ పవన్ మరియు ఆటో యూనియన్ డ్రైవర్లు, యజమానులు, మాక్సీ క్యాబ్ డ్రైవర్లు, యజమానులు మరియు సహాయకులు పాల్గొన్నారు.