ఏలూరు జిల్లా చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్  సిహెచ్. రాజశేఖర్ మరియు ధర్మాజిగూడెం ఎస్‌ఐ  వెంకన్న  వారి యొక్క సిబ్బంది తో కలిసి ది 29/30- 04-2025 యడవల్లి గ్రామం, లింగ పాలెం మండలం, ఏలూరు జిల్లా గ్రామస్థులతో పోలీసుల నేరుగా మమేకం – పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించినారు

ఏలూరు జిల్లా చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ సిహెచ్. రాజశేఖర్ మరియు ధర్మాజిగూడెం ఎస్‌ఐ వెంకన్న వారి యొక్క సిబ్బంది తో కలిసి ది 29/30- 04-2025 యడవల్లి గ్రామం, లింగ పాలెం మండలం, ఏలూరు జిల్లా గ్రామస్థులతో పోలీసుల నేరుగా మమేకం – పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించినారు

ఏలూరు జిల్లా పోలీసు శాఖ, ప్రజల రక్షణతో పాటు ప్రతి గ్రామస్తుడి తో సత్సంబంధాలను నెలకొల్పే దిశగా కృషి చేస్తోంది. ఈ దృష్టితో, జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, IPS ఆదేశానుసారం “పల్లె నిద్ర” కార్యక్రమాన్ని యడవల్లి గ్రామంలో నిర్వహించారు.

జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు. రవిచంద్ర పర్యవేక్షణలో, చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ సిహెచ్. రాజశేఖర్ మరియు ధర్మాజి గూడెం ఎస్‌ఐ శ్రీ వెంకన్న నేతృత్వంలో స్థానిక పోలీసు సిబ్బందితో కలిసి జరగింది.

పోలీసు అధికారులు గ్రామ ప్రజలతో ముఖాముఖి సమావేశమై, వారి సమస్యలు, ఆందోళనలు విన్నారు.

నేర నివారణ, సైబర్ మోసాలు, మహిళల భద్రత, మాదకద్రవ్యాల నియంత్రణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు.

పోలీస్ సేవలపై ప్రజల్లో విశ్వాసాన్ని బలపరిచే విధంగా చర్చలు నిర్వహించారు.

సైబర్ నేరాల నివారణకు 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.

అత్యవసర సేవల కోసం డయల్ 112 నంబరును వినియోగించుకోవాలన్నారు.

గోప్యమైన సమాచారం అందించాలనుకుంటే జిల్లా ఎస్పీ వాట్సాప్ నంబర్ 9550351100 కి మెసేజ్ పంపవచ్చని తెలిపారు.

మాదకద్రవ్యాల సమాచారం కోసం 1972 నంబరుకు ఫోన్ చేయాలని సూచించారు.

సమాచారం ఇచ్చిన వారి గోప్యతను కచ్చితంగా రక్షిస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా చింతలపూడి ఇన్స్పెక్టర్ శ్రీ సిహెచ్. రాజశేఖర్ మాట్లాడుతూ, “పోలీసు శాఖ ప్రజలతో మమేకమవుతూ, నిత్యం భద్రతా పర్యవేక్షణతో పాటు మానవీయ మూల్యాలను కూడా చాటిచెప్పే విధంగా “పల్లె నిద్ర” వంటి కార్యక్రమాలు కీలకం” అని పేర్కొన్నారు.

పోలీసు సేవలపై విశ్వాసాన్ని బలపరచడమే లక్ష్యంగా – పల్లె నిద్ర ప్రయాణం కొనసాగిస్తున్న చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ రాజశేఖర్ గారు మరియు వారి యొక్క సిబ్బంది